రాజస్థాన్‌లోని చురు జిల్లాలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వాతావరణం మారి, బలమైన ఈదురుగాలులతో కూడిన ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. తారానగర్ తహసీల్, మెహరి గ్రామాలతో పాటు పలు ప్రాంతాలు దుమ్ము, ధూళితో కమ్ముకుని అంధకారంలో మునిగిపోయాయి. సుమారు అరగంట పాటు కొనసాగిన ఈ తుఫాన్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆ తర్వాత కురిసిన భారీ వర్షం అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనాన్నిచ్చింది.