సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం, జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా జెల్ల అశ్విని ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు. తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఆమె అన్నారు. తమ వార్డు ప్రజలే తమకు కావాలని, వేరే వార్డు నుండి పోటీ చేసే అభ్యర్థులు గెలిస్తే వార్డు బంధికలుగా మారుతుందని గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల నుండి స్వతంత్ర అభ్యర్థి అయినా సరే తమ వార్డు నుండి అభ్యర్థి ఉండాలని వారు కోరుతున్నారు. జెల్ల సౌలు తమ కూతురిని ఆశీర్వదించమని కోరారు.