ఆందోలు రేపటి పంచాయితీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

5చూసినవారు
ఆందోలు రేపటి పంచాయితీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
జిల్లాలోని 10 మండలాల్లో ఆదివారం జరిగే పంచాయితీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 229 గ్రామపంచాయతీలు, 1,941 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఇప్పటికే మెటీరియల్తో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్