సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జిన్నా విజయ్ కుమార్ శుక్రవారం భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.