ఆదివారం ఉదయం ఆందోల్ నియోజకవర్గంలోని తార్ధాన్పల్లి టోల్లా జా సమీపంలోని వోల్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు.