చౌటకూర్ మండల పరిధిలోని అకోలా 161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జోగిపేట నుండి సంగారెడ్డికి బైక్‌పై వెళ్తున్న సిర్గాపూర్ మండలం వంగ్డాల్ గ్రామానికి చెందిన బస్వరాజ్, ఆయన భార్య చంద్రకళ అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో భార్యాభర్తలకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.