పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

902చూసినవారు
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో ఐసిడిఎస్ అంగన్ వాడి ఆధ్వర్యంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్ సైదా బేగం మాట్లాడుతూ, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించినప్పుడే తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్