సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గంలోని వట్టిపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సుమారు 43 లక్షల వ్యయంతో దుకాణ సముదాయ నిర్మాణానికి, 10 లక్షల వ్యయంతో ప్రహరి గోడ నిర్మాణానికి వట్టిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మీ శేషారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, వట్టిపల్లి సర్పంచ్ లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లక్ష్మణ్, దిగంబర్ రావు తదితరులు పాల్గొన్నారు.