జోగిపేటలో ఉచిత వైద్య శిబిరం: 200 మందికి లబ్ధి

916చూసినవారు
ఆందోల్ నియోజకవర్గం జోగిపేటలోని సోనియా డయాగ్నల్ సెంటర్ వద్ద ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జాన్ బాషా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరానికి భారీ స్పందన లభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది రోగులు హాజరయ్యారు. వారికి పరీక్షలు నిర్వహించి, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ ఫారుక్, రిపేర్ టైప్ రైటర్ మౌలాన్ సాబ్, జీశాన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్