రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి బయోఫార్మా రంగంలో తెరానిమ్ బయోలాజిక్స్ యూనిట్ ప్రారంభం ఒక కీలక ముందడుగు అని మంత్రులు శ్రీధర్ బాబు అన్నారు. హత్నూర మండలం బోరుపట్ల శివారులో బుధవారం ఈ యూనిట్ ను ప్రారంభించారు. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.