సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో ఆదివారం 'మెతుకుసీమ వైభవం ఆధ్వర్యంలో కాకతీయుల కాలం నాటి శ్రీ తుమ్మరేశ్వర స్వామి ఆలయం వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించారు. పర్యటకులు ఆలయంలోని స్వయంభు లింగేశ్వరుని దర్శించుకుని, ఆలయ చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతంలోని చారిత్రక, పురావస్తు, సాంస్కృతిక సంపదను భావితరాలకు పరిచయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కూడా పాల్గొన్నారు.