జోగిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావిణ్య, పదో తరగతిలో 100% ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల చదువుతీరును అడిగి తెలుసుకున్న ఆమె, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆమె తెలిపారు.