జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జోగిపేట సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. గురువారం జోగిపేటలో అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలో మోడల్ కోడ్ అమల్లో ఉందని, ప్రచారం కోసం అన్ని రకాల అనుమతులు ముందస్తుగా తీసుకోవాలని సూచించారు.