జోగిపేట: వైద్యుల గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం

2చూసినవారు
జోగిపేట ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీ సమయంలో వైద్యులు గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెంట్ సామ్యతో పాటు మరో 11 మంది వైద్యులు విధులకు రాలేదని గుర్తించారు. ఆ సమయంలో ఇద్దరు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. గైర్హజరైన వైద్యులకు షోకాజు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డి సి హెచ్ ఎస్ కు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్