ఆందోలు-జోగిపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని మున్సిపాలిటీ ఇన్చార్జి నరహరి రెడ్డి సూచించారు. జోగిపేటలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నాయకులు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.