జోగిపేట: పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి

77చూసినవారు
జోగిపేట: పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల 2 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జోగిపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్యకు గురువారం వినతి పత్రం సమర్పించారు. మెడికల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరాజ్యం మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిరంజీవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్