ఆందోలు జోగిపేట మున్సిపాలిటీలోని 19 వార్డులలో ఎన్నికల సంఘం అమలు చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఫారాల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.