జోగిపేట ఎక్సైజ్ సీఐని ఘనంగా సన్మానించిన కల్లుగీత సంఘం

1చూసినవారు
జోగిపేట ఎక్సైజ్ సీఐని ఘనంగా సన్మానించిన కల్లుగీత సంఘం
జోగిపేట ఎక్సైజ్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏడుకొండలు, ఎస్ఐ రామకృష్ణలను కల్లుగీత కార్మిక సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. గ్రామాల్లో గీత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఐ, కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, కార్యదర్శి ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్