కంది పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

916చూసినవారు
కంది పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పిలుపునిచ్చారు. కంది గ్రామంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు పెంచడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని, ప్రతి ఇంటి ముందు మూడు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్