కోహిర్ మండలంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సాధ్యమైనంత వరకు ఇళ్లకు పరిమితం కావాలని సూచిస్తున్నారు.