మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామం పాత సంప్రదాయాలతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఆధునిక కాలంలో మరుగున పడ్డ జడ కొప్పు కోలాటం వంటి అలనాటి కళలకు గ్రామ ప్రజలు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. నేటి ఏఐ జనరేషన్ లో అనేక బాధలు, సమస్యలు ఉన్నాయని, పాశ్చాత్య పద్ధతులకు భిన్నంగా నాటి తరంలో కొనసాగిన భజనలు, కీర్తనలు, జడ కొప్పు కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలను మర్పల్లి గ్రామ ప్రజలు కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్తూ గ్రామానికి మంచి గుర్తింపు తెస్తున్నారు.