మునిపల్లి మండలం లింగంపల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాలకు రూ. 7.40 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం తెలిపారు. ఈ నిధులతో డార్మెటరీ, ఆరు అంతస్తుల భవనాలు, టాయిలెట్లు, కిచెన్, డైనింగ్ హాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు.