మునిపల్లి: SC బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్

3144చూసినవారు
మునిపల్లి: SC బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్
మునిపల్లి ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని మండల ప్రత్యేక అధికారి ఎస్.బి. రామాచారి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల నివాస గదులు, స్టోర్ రూమ్, కిచెన్ రూమ్, బాత్రూములు, మెనూ గురించి ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన మెనూతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు తెలపడంతో, వార్డెన్ రామప్పని, సిబ్బందిని అభినందించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్