రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన నేరడి గుంట విద్యార్థులకు సన్మానం

0చూసినవారు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన నేరడి గుంట విద్యార్థులకు సన్మానం
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నేరడి గుంట గ్రామానికి మంచి పేరు తెచ్చిన జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రణయ్, మానసలను బుధవారం గ్రామ సర్పంచ్ ఓగ్గు సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామ యువత క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పోటీల్లో ప్రతిభ చూపితే ఇద్దరికీ తలా రూ. 10, 000 ప్రోత్సాహక బహుమతి ఇస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్, వార్డు సభ్యుడు బోయిని శంకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్