సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని MPPS రాయకోడ్ పాఠశాలలో శనివారం విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పేరెంట్-టీచర్ సమావేశం, బాగ్లెస్ డే, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, క్రమశిక్షణ, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసంపై తల్లిదండ్రులతో చర్చించారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి.