నాగులపల్లిలో పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

688చూసినవారు
నాగులపల్లిలో పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం నాగులపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లీ ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని ఆదివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం భిక్షపతి, స్థానిక సర్పంచ్ నరేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవం నాగులపల్లిలో శ్రీ పోచమ్మ తల్లి జాతరలో భాగంగా జరిగింది.

సంబంధిత పోస్ట్