
రూ.4 లక్షల బంగారు నగలను అప్పగించిన ఆటో డ్రైవర్
AP: వైఎస్సార్ కడపలో ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. ఆటోలో ఓ ప్రయాణికురాలు రూ.4 లక్షల విలువైన బంగారు నగలను మరిచిపోయి వెళ్లిపోయింది. ఆ నగలను ఆటో డ్రైవర్ చిన్నచౌక్ పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఆ నగలను బాధితురాలికి అప్పగించారు. ఆటో డ్రైవర్ చేసిన పనికి పోలీసులు అభినందించారు.




