రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ హామీ ఇచ్చారు. మంగళవారం పుల్కల్ మండలం బొంగులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.