బొడ్మట్‌పల్లిలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభం

1210చూసినవారు
బొడ్మట్‌పల్లిలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభం
సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం, టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం కార్యదర్శి, గ్రామ సర్పంచ్ తలారి అవినాష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి, "పల్స్ పోలియో – నిండు ప్రాణానికి రెండు చుక్కలు" అనే నినాదాన్ని గుర్తుంచుకుని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో అందరి భాగస్వామ్యం కీలకమని తెలిపారు.

సంబంధిత పోస్ట్