రాయికోడ్ మండలంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ చైతన్య కిరణ్ సూచించారు. యూసఫ్ పూర్ వాగు పొంగిపొర్లుతున్న కారణంగా రహదారిపై రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, పిల్లలను వాగులు, కాలువల వద్దకు వెళ్లనివ్వద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో రాయికోడ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.