ఆందోల్ నియోజకవర్గానికి రూ. 100 కోట్ల రోడ్ల అభివృద్ధి

0చూసినవారు
ఆందోల్ నియోజకవర్గానికి రూ. 100 కోట్ల రోడ్ల అభివృద్ధి
ఆందోలు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 100 కోట్ల పనులకు పరిపాలనా అనుమతి లభించిందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మక్తాక్యాసారం – మునిపల్లి (గార్లపల్లి, అల్లాపూర్ మీదుగా) రోడ్డును సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్‌గా విస్తరించడానికి రూ. 30 కోట్లు, సంగుపేట్ – పోచారం రోడ్డు (0/0 నుండి 18/0 కి. మీ.) విస్తరణ & బలోపేతం కోసం, మిన్‌పూర్ – ముదిమాణిక్యం రోడ్డు (0/0 నుండి 3/3 కి. మీ.) సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్‌గా విస్తరణకు రూ. 40 కోట్లు, నార్సింగి – శంకరంపేట వరకు హై లెవెల్ బ్రిడ్జి తో పాటు రోడ్డు అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్