సంగారెడ్డి పాత పట్టణంలో ఈ నెల 4, 5 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గంజి మైదానం, ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, మంజీరా నగర్, తార కళాశాల, గవర్నమెంట్ హాస్పిటల్, జైల్ ట్యాంకుల నుంచి నీటి సరఫరా జరగదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.