పోలియో చుక్కలు వేసిన సర్పంచ్, తల్లిదండ్రులకు విజ్ఞప్తి

1370చూసినవారు
పోలియో చుక్కలు వేసిన సర్పంచ్, తల్లిదండ్రులకు విజ్ఞప్తి
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాసాన్ పల్లి గ్రామ పంచాయతీలో, గ్రామ సర్పంచ్ బంటు సత్యం ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి అని, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్