నూతన వధూవరులకు సర్పంచ్ హెల్మెట్లు బహుకరణ

677చూసినవారు
నూతన వధూవరులకు సర్పంచ్ హెల్మెట్లు బహుకరణ
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి మండలం అల్లాపూర్ గ్రామ సర్పంచ్ నారాయణ, శుక్రవారం నూతన వధూవరులకు హెల్మెట్లు బహుకరించారు. మండలంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని, వారిని ఆశీర్వదించి, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పక హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ చర్య ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్