హైదరాబాద్ సచివాలయంలో గురువారం జరిగిన సమీక్షలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ సింగూరు సేఫ్టీ డ్యాం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ డిపిఆర్ ను వెంటనే తయారు చేసి సమర్పించాలని సూచించారు. జూన్ నెలాఖరు వరకు రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.