సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (న్యాయమూర్తి) సౌజన్య మాట్లాడుతూ,
విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. లక్ష్యంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు.