చర్ల రాయిపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి

4388చూసినవారు
చర్ల రాయిపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పరిధిలోని రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్ల రాయిపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి రజిల్ (25) అనే యువకుడు బుధవారం ఇంట్లో దూలానికి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతిపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ బి. సైదా, రూరల్ సీఐ జక్కుల హనుమంతు, రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరణ్ సందర్శించి పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్