తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్, విద్యా కమిషన్ నివేదికపై ప్రజల్లో చర్చ పెట్టాలని కోరారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో చర్చ జరిగితేనే సరైన సమాచారం వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.