ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్య

5చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సంగాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ వెంకట్ రెడ్డి ప్రత్యేక కృషి, గ్రామ ప్రజల సహకారంతో విద్యార్థుల సంఖ్య 6 నుంచి 43కు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషి అవసరమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నరసింహులు, సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ సలాహుద్దీన్, ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్