హత్నూర మండలం బోరపట్ల శివారులో అత్యాధునిక బయోలాజికల్ ఔషధాల తయారీ యూనిట్ కీలక పాత్ర పోషించనుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఇలాంటి సంస్థలు బలాన్ని చేకూరుస్తాయని, ఔషధ, బయోటెక్నాలజీ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల విస్తరణతో పాటు స్థానిక ప్రజల జీవనోపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడతాయని మంత్రి వివరించారు.