
దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలసరి స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీపీ పర్ క్యాపిటా) పరంగా భారతదేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అవతరించింది. కొన్ని సర్వేల ప్రకారం, రంగారెడ్డి జిల్లా తలసరి జీడీపీ సుమారు రూ.11.46 లక్షలుగా ఉంది. ఐటీ కారిడార్, టెక్ పార్కులు, ఔషధ, బయోటెక్ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి, మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఈ అగ్రస్థానానికి కారణాలుగా నిలిచాయి. గతంలో అగ్రస్థానంలో ఉన్న గురుగావ్, బెంగళూరు అర్బన్ వంటి జిల్లాలు కూడా రంగారెడ్డి కంటే ఈ సారి వెనుకబడ్డాయి.




