స్వయం సహాయక సంఘాల మహిళల కోసం హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ వైద్య పరీక్షల స్కీనింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. టి డయాగ్నస్టిక్స్ ద్వారా ప్రతి మహిళకు 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.