
టేక్మల్: దర్గాలో మంత్రి దామోదర ప్రార్ధనలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం టేక్మాల్ దర్గా హజరత్ షాహిద్ అల్లా ఖాద్రి దర్గా 198వ ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆయన ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి, అల్ ఇండియా జమ్యూతుల్ ముషాయాఖ్ అధ్యక్షులు సయ్యద్ షా అహ్మద్ నూరుల్లా హస్ని హుసేని ఖాద్రి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మజ్జుర్, స్థానిక సర్పంచ్ సుధాకర్, మండల అధ్యక్షుడు రమేష్ కూడా పాల్గొన్నారు.








































