వర్క్ ఫ్రం హోం పేరిట మోసం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

1962చూసినవారు
వర్క్ ఫ్రం హోం పేరిట మోసం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న తాడూరి రుతిక్ రోషన్, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో జరిగిన ఆన్లైన్ మోసంలో సుమారు 30 వేల రూపాయలు కోల్పోయాడు. ఈ మోసం కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తన తండ్రికి చెప్పాడు. వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్