దుబ్బాక మండలం గాజులపల్లిలోని MPPS పాఠశాల గోడలకు సర్పంచ్ పంజ స్వామి ఆధ్వర్యంలో పెయింటింగ్ బొమ్మలతో అలంకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు పాఠశాల అందంగా ఉంటే పిల్లల్లో పరిశుభ్రత అలవాటవుతుందని, మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, ఊరికి మంచి పేరు తేవాలని సూచించారు.