గజ్వేల్: ఎన్నికల వేళ ప్లెక్సీ వైరల్

1159చూసినవారు
గజ్వేల్: ఎన్నికల వేళ ప్లెక్సీ వైరల్
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 19వ వార్డులో సామాజిక కార్యకర్త సుంకరి బాల్ కుమార్ తన ఇంటి గేటుకు 'మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు' అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ జరిగే అవకాశం ఉన్నందున, ఓట్ల కొనుగోలుకు తన ఇంటికి రావద్దని ఆయన కోరారు. ఓట్లను అమ్ముకోవద్దని, నచ్చిన వారికి ఓటు వేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన అన్నారు.