గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కృత్రిమ మేధస్సు (AI) పుట్టినరోజు సందర్భంగా “కృత్రిమ మేధస్సు చరిత్ర” పై ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శన జరిగింది. ఈ డాక్యుమెంటరీ ద్వారా 1956లో AI ఆవిర్భావం నుండి నేటి జనరేటివ్ AI వరకు సాధించిన అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగాల్లో AI వినియోగం, భవిష్యత్ అవకాశాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహాం ముఖ్య అతిథిగా, డాక్టర్ సరోజ సమన్వయకర్తగా, కంప్యూటర్ అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.