శనివారం రాత్రి కొండపాక మండలం దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు దాటుతున్న మహిళలను తప్పించబోయిన కారు అదుపుతప్పి ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 13 ఏళ్ల అమ్మాయి తీవ్ర గాయాలపాలైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు దుద్దెడ వద్దకు చేరుకోగానే రోడ్డు దాటుతున్న ఆరే రాధమ్మ అనే మహిళను తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి, ఆమెను, ఆమె ఇంటి వద్ద కూర్చున్న మరో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.