సిద్దిపేట: చెరువులో పడి వ్యక్తి మృతి

799చూసినవారు
సిద్దిపేట: చెరువులో పడి వ్యక్తి మృతి
బుధవారం సాయంత్రం దొమ్మట గ్రామంలో బాలిగారి మల్లేశం (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి బొమ్మ చెరువులో పడి మృతి చెందాడు. స్నానానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేసినా అప్పటికే మరణించాడు. దౌల్తాబాద్ ఎస్సై అరుణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్