సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కెప్టెన్ చౌడు తండా గ్రామపంచాయతీ పరిధిలోని బొడిగం రాజిరెడ్డి వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు ఓ నెమలి పడిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాముడు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో నెమలిని సురక్షితంగా బయటికి తీశారు. అనంతరం నెమలికి ప్రథమ చికిత్స అందించి, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత గండిపల్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సమయస్ఫూర్తితో స్పందించి జాతీయ పక్షి నెమలి ప్రాణాలను కాపాడిన అధికారులను గ్రామస్తులు అభినందించారు.